Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోడు పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు
నవతెలంగాణ-జనగామ
ఏసిరెడ్డి నగర్ డబల్ బెడ్ రూమ్ వాసుల గోసను స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు విద్యుత్, తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో కాలనీవాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 18 రోజు కొనసాగాయి. దీక్షలను కాలనీవాసులు బోర్డు అంజమ్మ లక్ష్మి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మౌలిక వసతులు కల్పించడంలో జిల్లా అధికారుల, ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పగించి రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం, అధికారులు కనీస సౌకర్యాలైన మంచినీరు, కరెంటు, వీధిలైట్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో పాములు, తేళ్లు, విషపురుగుల భారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి అడగ్గానే నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి తమ ఇండ్ల స్థలాలను ఇచ్చినట్టు తెలిపారు. తమ త్యాగాన్ని గుర్తించి తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. లేదంటే దీక్షలు ఇలానే కొనసాగు తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ సైదా ది, షాడ సునీత, మేడ నాగమణి, రాగల సౌందర్య, బత్తుల అరుణ, గుండె రేణుక, చింత సోమయ్య, బుడ్డ రూబేను, తదితరులు పాల్గొన్నారు.