Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్రంలో దళితబంధు తరహాలో రజక వృత్తిదారుల కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో మండల కేంద్రంలో నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్‌ను సర్పంచ్ వీరమనేని యాకాంతరావుతో కలిసి ఆశయ్య బుధవారం ప్రారంభించారు. అనంతరం చిట్యాల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆశయ్య మాట్లాడారు. రజక వృత్తిదారులు తరతరాలుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సేవ చేస్తూ అత్యంత వెనుకబడినట్టు తెలిపారు. ఆర్థికంగా. సామాజికంగా. రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రజకులను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆదుకోవడానికి ప్రత్యేక ఆర్థిక పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బంధు పథకం ద్వారా రజక కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున అందించాలని కోరారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని రజక వత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ఎకరం భూమి తోపాటు ఐలమ్మ పేరున స్మారక భవనాన్ని నిర్మించాలని కోరారు. సమస్యల సాధనకై రజక వత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాడరాజు యాకయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి మదార్, నాయకులు చిట్యాల ఎల్లయ్య, చిట్యాల యాకయ్య, చిట్యాల సంపత్, చిట్యాల సోమయ్య, లొంక ఐలయ్య, గుమ్మడిరాజు పాపయ్య, జ్యోతి యాదగిరి, పొలాస సోమయ్య, ఏలూరు వేణు, మాడరాజు సంపత్, జ్యోతి అంజయ్య, మచ్చ ఎల్లయ్య, వెంకన్న, మధు, తదితరులు పాల్గొన్నారు.