Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పాటిమీద ఆలయంలో టావా ఆధ్వర్యంలో మార్గం సతీష్ దర్శకత్వంలో క్రియేటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ప్రసరమయ్యే సూర్య వర్సెస్ నిత్య వెబ్ సిరీస్ ఫిలిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమనికి సీఐ కరుణాకర్‌రావు క్లాప్ కొట్టగా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. తొర్రూర్ ప్రాంత కళాకారులు అద్భుతమైన చిత్రాలకు నాంది పలకాలని కోరారు. ఉత్తమమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని లఘు చిత్రాలను రూపొందించాలని సూచించారు. మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ గుర్తింపు వచ్చేలా సినిమా రూపకల్పన చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ శీలం లింగంగౌడ్, కౌన్సిలర్ కొలుపుల శంకర్, టావా అధ్యక్షుడు కస్తూరి పులేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్‌కుమార్, నటుడు మహేష్‌చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ వైశాలీ ప్రభాకర్, కెమెరామెన్ సుమంత్ శీలం, కమ్మగాని సుధాకర్, టావా సభ్యులు రాగి ఈశ్వరప్రసాద్, రేగొండ రామకృష్ణ, గుగులోత్ రమేష్, కస్తూరి సంధ్య, రఘు, దిలీప్, సాయి తదితరులు పాల్గొన్నారు.