Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు జాంబయ్య
నవతెలంగాణ-ములుగు
బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్‌ను ఓబీసీ, బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన యోధుడుగా యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు గండ్రకోట జాంబయ్య యాదవ్ అభివర్ణించారు. జిల్లా కేంద్రంలో సామాజిక ప్రజాస్వామిక వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు పోరిక సామెల్ నాయక్ అధ్యక్షతన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ నాయకుడు జాంబయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. బీహార్‌లో ఓబిసి, బీసీ రిజర్వేషన్ల కొరకు పోరాడి సాధించినట్టు తెలిపారు. బిందేశ్వర్ ప్రసాద్ జడ్జిగా పని చేశారని చెప్పారు. తదనంతరం జాతీయ కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీకి ఎన్నికై బడుగుల పక్షాన నిలిచారని తెలిపారు. 1967లో ఏడు స్థానాలున్న సోషలిస్టు పార్టీకి ప్రచార బాధ్యతలు స్వీకరించి 69 సీట్లను సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. అవినీతిపై నిరంతరం పోరాటం చేసే వాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతిపై పోరాటం చేశారని కీర్తించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కోరె రవి, భద్రయ్య, గూడెల్లి ఓదెలు, శ్రీనివాస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.