Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల నిరసన
నవతెలంగాణ-జఫర్ఘడ్
మండలంలోని భూసమస్యలు పరిష్కరించా లని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రడపాక సుదర్శన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తొలుత వ్యవసాయ శాఖపై ఏఓ హరిదాసు వివరణ ఇస్తుండగా వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య జోక్యం చేసుకున్నారు. పట్టా ఉన్నా అసైన్డ్ భూములుగా నమోదైన సమస్యను పరిష్కరించాలని వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ సుదర్శన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రజాప్రతినిధులు వినకుండా నిరసన తెలిపారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రైతుల పట్టా భూములను అసైన్డ్ భూములుగా అధికారులు నమోదు చేశారని మండిపడ్డారు. సుమారు 5 వేల ఎకరాల పట్టా భూములను రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూములుగా నమోదు చేశారని చెప్పారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని తెలిపారు. సాయంత్రం వరకు మండల సర్వసభ్య సమావేశంలో నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇల్లెందుల బేబీ శ్రీనివాస్ పాల్గొన్నారు.