Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇతరులకు ఓటీపీ నెంబర్లు చెప్పొద్దు
అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు
నవతెలంగాణ-భూపాలపల్లి
పెరుగుతున్న అంతర్జాల వినియోగంతో సైబర్ మోసాలు సైతం పెరుగుతున్నాయని ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి బశ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రకాలుగా సైబర్ మోసగాళ్ళు ప్రజలకు ఆర్ధిక నష్టాన్ని కలగజేస్తున్నారని, ఎక్కువగా ఓటీపీ నెంబర్ తెలుసుకుని మోసాలు చేస్తున్నారని అన్నారు. ఎలాంటి ఓటీపీ నంబరైనా ఇతరులకు చెప్పొద్దని అన్నారు. బ్యాంక్ ఖాతా కు ఆధార్ లింక్, ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలు సరిగా లేవు, పాన్ కార్డు అప్డేట్ చేయాలంటూ ఓటీపీ నంబర్లను తీసుకుని అకౌంట్ లోని నగదును దొంగిలించి అవకాశం ఉన్నదని అన్నారు. ఫోన్లకు వచ్చే నీలి రంగు లింకులు ప్రజలు అనుసరింరచొద్దని అన్నారు. బహుమతులు వచ్చాయి, మంచి ఉద్యోగం ఉంది, కార్లు, వాహనాలు తక్కువ ధరకు వస్తాయి, ముందుగా చార్జీలు చెల్లించండి అంటే ఎవరు ఇతరులకు డబ్బులు ఇవ్వొద్దని పేర్కొన్నారు. ఇంటర్నెట్ వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫేస్బుక్ ద్వారా డబ్బులు అడిగితే సంబంధిత వ్యక్తిని సంప్రదించిన తర్వాతే డబ్బులు పంపాలని సూచించారు.