Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సభ్యులు నిర్భయంగా ఓటు వేయండి
చాంబర్ మాజీ అధ్యక్షులు కంభంపాటి, కటకం
నవతెలంగాణ కాశిబుగ్గ
చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు ఓడిపోతామని తెలిసి బొమ్మినేని ప్యానల్ సభ్యులపై వ్యక్తిగత దూషణలు చేస్తు, ఇండిస్టీ వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి బెదిరింపులు భయపడేది లేదని చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కంభంపాటి కుమార స్వామి, కటకం పెంటయ్యలు అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బొమ్మినేని రవీందర్ రెడ్డి ప్యానల్ సభ్యులతో కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లోని మిర్చి, కాటన్, పల్లి, పసుపు, ఆపరాల యార్డులలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పత్తి యార్డులో ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులుగా చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కంభంపాటి కుమారస్వామి, కటకం పెంటయ్య మాజీ ఉపాధ్యక్షుడు దుగ్యాల గోపాల్ రావు, మాజీ కోశాధికారి నాగమల్ల పూర్ణ చందర్, మాజీ సంయుక్త కార్యదర్శి మల్లాడి బాసి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య కార్మిక కర్షక శ్రేయస్సుకోసం వ్యాపారుల కోరికమేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకున్న 30సంవత్సరాల అనుభవంతో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలతో ఉన్న సంబంధాలతో వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. చాంబర్ సభ్యులు బెదిరింపులకు భయపడకుండా తన ప్యానల్ లోని 10మంది సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో రాజకీయ జోక్యాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.