Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
బుధవారం విడుదలైన ఎంసెట్-2021 ఎంట్రెన్స్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మెడికల్ విభాగంలో షైన్ విద్యాసంస్థల విద్యార్థిని 870వ ర్యాంకు సాధించిందని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఫలితాలు రాబట్టామని షైన్ విద్యాసంస్థల చైర్మెన్ మూగల కుమార్‌యాదవ్, డైరెక్టర్లు డాక్టర్ వేణుమాధవ్, పి రాజేంద్రకుమార్ తెలిపారు. వరంగల్‌లో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్‌లో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నటుట తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయిలో 870వ ర్యాంకు సాధించిన నష్రా ఆశ్రీన్‌ను అభినందించారు. మెడికల్ విభాగంలో ఎన దీక్షారెడ్డి-2463ర్యాంకు, ఆర్ ప్రణవ్నాధ్ 2847ర్యాంకు, వి సాత్విక 6183ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో వి లక్ష్మన్రెడ్డి 2178ర్యాంకు , వి శివాని 2207ర్యాంకు, అమిర్పాషా 2620 ర్యాంకు, ట హేమంత్ 4962ర్యాంకు, బి మేఘన 5469ర్యాంకు, ఎం రమ్యశ్రీ 6167ర్యాంకు, వి రామ్‌రెడ్డి 6808ర్యాంకు, వీరితో పాటు 25మంది విద్యార్థులు ఎంసెట్-2021లో పదివేల లోపు ర్యాంకు సాధించారని తెలిపారు. వీరందరూ రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలో సీట్లు సాధిస్తారని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్తోమామూలు విద్యార్థులను కూడా మెరికలు తిరిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.ప్రతి విద్యార్థిపైన వ్యక్తిగత శ్రద్ద తీసుకోవడం వల్ల ఈ విజయాలు సాధించారని వారు పేర్కొన్నారు. ఈ విజయాలకు తోడ్పడిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారివెంట షైన్ విద్యాసంస్థల ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్, డైరెక్టర్ రంగనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన రాజుగౌడ్, అధ్యాపకులు పాల్గొన్నారు.