Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
ప్రజలకు సేవ చేయడంతోనే రాజకీయ నాయకుల జీవితాలకు సార్థకత లభిస్తుందని రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య ప్రజాసేవ చేసి, గామాన్ని అభివద్ధి పథంలో నడిపించినందుకే జిల్లాలో ఉత్తమ సర్పంచుగా ఎన్నికై అవార్డు అందు కున్నాడని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభివర్ణించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సర్పంచ్ నర్సయ్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పజాప్రతినిధులు అయ్యే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవడంలో గారె నర్సయ్య విజయం సాదించడాని కొనియాడారు. పార్టీలకు మతాలకు,రాగద్వేషాలకు అతీతంగా సేవలు అందించినప్పుడే సమాజంలో అత్యున్నత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడు కనుక ఐదు సంవత్సరాల్లో చేసే పనులు చిరకాలం నిలిచిపోయే విధంగా ఉండాలని అలాంటి పాలన నర్సయ్య చెయ్యడం సంతోషకరమని తెలిపారు.ప్రతి నాయకునికి పరిపాలన చేసే అవకాశం రాదని వచ్చినప్పుడే అవకాశాన్ని దుర్విని యోగం చేసుకోకుండా రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్యల చేపట్టాలని వివరించారు.సొంత మండ లమైన రాయపర్తి గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా,ఉత్తమ సర్పంచుగా గారె నర్సయ్యకు అవార్డులు రావడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మహబూబ్నగర్ సర్పంచ్ గాదె హేమలత రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.