Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ప్రజలు మరింత శుభ్రత పాటించాలని పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ కోరారు. మండలంలోని చల్వాయి గౌరారం గడ్డ ప్రాంతంలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. దగ్గు, ఒంటి నొప్పులు ఎడతెరిపి లేకుండా జలుబు ఉంటే స్థానిక వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరిగి పరిశుభ్రత గురించి వివరించారు. డ్రమ్ములు, పాత వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు. వైద్య శిబిరంలో 43 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 11 మందిని బాధితులుగా గుర్తించి మందులు అందించినట్లు తెలిపారు. అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కానట్టు చెప్పారు. మలేరియా కూడా ఎవరికీ లేదన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పవన్‌కుమార్, ఎంఓ జంపయ్య, రంజిత్, సమత, తదితరులు పాల్గొన్నారు.