Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమై పల్లెలలు అభివద్ధి చెందుతాయని పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు. గ్రామాల్లో పల్లె ప్రకతి వనాలు, స్మశాన వాటికలు, ఇతర పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుత వానాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ఆరోగ్య శాఖ అధికారులు, సర్పంచ్లు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే నిర్మాణం పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మిషన్ భగీరథ నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుపై ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలని కోరారు. మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రూ.50 లక్షలు, సైడ్ కాల్వ కోసం రూ.4.35 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా పెద్దవంగర, చిట్యాల గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అందరి సహకారంతో మండలాన్ని అభివద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కషి చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, ఎంపీడీఓ శేషాద్రి, తహసీల్దార్ సరిత రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మురళీధర్, ఐబీ డీఈఈ పూర్ణచందర్, ఎంపీడీఓ యాకయ్య, వైస్ ఎంపీపీ కల్పన, తదితరులు పాల్గొన్నారు.