Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మత్స్య విభాగ కార్యవర్గాన్ని శుక్రవారం నియమించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందించారు. మత్స్య సెల్ జిల్లా అధ్యక్షుడుగా కంబాల రవి, ఉపాధ్యక్షులుగా రామెల్ల రాజశేఖర్, కొండబోయిన శంకర్, కంకణాల రఘు, పోలు రవి, మేడబోయిన రాజశేఖర్, ప్రధాన కార్యదర్శిలుగా మెర రాజమౌళి, కంకణాల నర్సయ్య, బట్ట రామారావు, కో-ఆర్డినేటర్లుగా దండబోయిన రఘుపతి, పిట్టల మహేందర్, ఎద్దు రాజ్‌కుమార్, వెంకన్న, కంపెల్లి ప్రభాకర్, అన్నెబొయిన్ వెంకటస్వామి, కోశాధికారిగా చింత ధర్మ, సహాయ కార్యదర్శులుగా కట్ల మహేందర్, కొండబోయిన స్వామి, ప్రచార కార్యదర్శిగా చొప్పరి రాజేందర్, సభ్యులుగా అన్నెబోయిన వెంకటస్వామి, దాసరి మహేందర్, చిటమట మహేందర్, రంగరబోయిన జగదీష్, గుమెల్ల పార్థసారథి, బండి శ్యామ్, బండి రాజు, అంకం సురేష్, నేలం సమ్మయ్య, అల్లం రామచంద్రు నియమితులయ్యారు. అలాగే మత్స్య సెల్ మండల అధ్యక్షుడుగా సాదం సాంబయ్య, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి కిరణ్, నర్ర రవిశంకర్, గోల్కొండ సాంబయ్య, కొండబోయిన దేవరాజు, ప్రధాన కార్యదర్శులుగా దాసరి రమేష్, ఉప్పు మహేందర్, కంచం గట్టయ్య, ప్రధాన కార్యదర్శిగా రేగుల రాజేందర్, సహాయ కార్యదర్శిగా తిరుపతి, సహాయ కార్యదర్శిగా చెక్క రవి, సభ్యులుగా సాదు రవి, కట్ల సదయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. మండలంలో, జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ కూచన రవళిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మల్లాడి రాంరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మీ, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అయూబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, ఇర్సవడ్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.