Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ కోమటిరెడిడ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని శ్రీసాయి కృష్ణ నర్సింగ్ హోమ్‌లో ఆరోగ్యశ్రీ సేవలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఆరోగ్యశ్రీ సేవల గుర్తింపు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆర్థోపెడిక్స్ పాలీట్రామా కేసులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలిగిందన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేశంలో అనేక మంది పేదలకు ఉచిత వైద్యం అందుతోందని తెలిపారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో చాలా ఆస్పత్రులు సేవలు నిలిపేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆరోగ్య సేవలు అందించిన డాక్టర్లకు డబ్బులు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోగల యమున లింగయ్య, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ లవకుమార్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.