Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ధర్మసాగర్ రెవెన్యూ అధికారులకు అక్రమ పట్టాలు రద్దు కాకుండా భూ ఆక్రమణ చేసిన వారికి అనుకూలంగా తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు వల్లపురెడ్డి మురళీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2018లో నాటి తాసిల్దార్ బి. నాగేశ్వరరావు కలెక్టర్ కార్యాలయం నుండి పదిసార్లు నోటీసులు వచ్చినా దస్తావేజులు పరిశీలించకుండా నోటీసు ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పట్టాలు చేసుకున్నా వారికి అనుకూలంగా నివేదిక ఇచ్చారన్నారు. ఇదేవిషయమై పూర్తి ఆధారాలతో సంబంధిత అధికారులకు విన్నవిం చినా పట్టించుకోలేదన్నారు. సమాచార హక్కు చట్టం-2005 ద్వారా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేశామన్నారు. స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ సంబంధిత అధి కారులను జూలై 5న హాజరుకావాలని నోటీసులు జారీ చేసిందన్నారు. రికార్డులు పరిశీలించి 15 రోజుల్లోగా తగు చర్యలు తీసుకొని పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. ఈ విషయంపై సీసీఎల్ఏ హైదరా బాద్ రిపోర్టు ఇవ్వాలని 25/11/2019న నోటీస్ పంపించినా చర్యలు తీసుకోలేదన్నారు. తమ భూమి తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆత్మహత్యలేే శరణ్యమని కన్నీటిపర్యంతమయ్యారు.