Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల పరిధి గోపనపల్లికి చెందిన ప్రముఖ రచయిత్రి శెట్టె రవళిక(కావ్యజ్వాల)కు అరుదైన అవార్డు లభించింది. 75వ అమృత మహౌత్సవ్ (ఇండిపెండెన్స్ డే) సందర్భంగా హైదరాబాద్లోని బొజ్జ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో రవళికకు నేషనల్ విశిష్ట సేవా జ్యోతి అవార్డు దక్కింది. శుక్రవారం ఫౌండేషన్ చైర్మెన్ రామ్ మోహన్రావు విలేకర్లతో మాట్లాడారు. బొజ్జ నారాయణరావు స్మారకార్థం నాలుగు అంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో అవారు అందజేశామన్నారు. చిన్న వయసులోనే సాహిత్య రంగంలో విశేషంగా రాణిస్తున్న రవళికను అభినందించారు. అమె రచనలు, సేవలను కొనియాడారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అవార్డు మొమెంటోను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిస్ యూనివర్స్-2018 హిమజా నాయుడు, ఎంపీటీసీల ఫోరం జనరల్ సెక్రటరీ అందె యాకయ్య, ఏబీసీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ లయన్ కేవీ.రమణారావు, చిట్యాల మాజీ సర్పంచ్ దేవేందర్, ప్రముఖ స్టోరీ రైటర్ నెల్లుట్ల సునీత, సోషల్ వర్కర్ అవినాష్ జైన్ పిచాల్య పాల్గొన్నారు