Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి జయంతి
నవతెలంగాణ-పాలకుర్తి
17 నెలల తర్వాత సెప్టెంబర్ 1 నుండి విద్యా సంస్థలను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించడంతో అంగన్వాడీ కేంద్రాల్లో పండగ వాతావరణాన్ని కల్పించేందుకు అంగన్వాడి కార్యకర్తలు కషి చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని జయంతి సూచించారు. శుక్రవారం పాలకుర్తిలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో జయంతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభానికి నూతన ఒరవడిని సష్టించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో 17 నెలల తర్వాత ప్రారంభానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని కరోన నిబంధనలను పాటిస్తూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు బాలింతలు గర్భిణీలు మాస్కులు ధరించి రావాలని సూచించారు 695 అంగన్వాడీ కేంద్రాల్లో 4241 మంది గర్భిణీలు. 3199 మంది బాలింతలు. మూడు సంవత్సరాల లోపు 15108 మంది. 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు 11223 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 217 సొంత భవనాలు 180 అద్దె భవనాలు 298 ఉచిత భవనాలు ఉన్నాయని తెలిపారు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో హరిత హారంలో కరివేపాకు ఉసిరి మునగ నిమ్మ జామ బొప్పాయ లాంటి మొక్కలు 1138 నాటమని తెలిపారు అంగన్వాడీల ప్రారంభానికి ప్రజాప్రతినిధులను ప్రజలను ఆహ్వానించాలని సూచించారు జిల్లా కేంద్రంలో సఖి కేంద్రం అందుబాటులో ఉందని సఖి కేంద్రాన్ని అత్యాచార బాధితులు గహ హింస బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టిక ఆహారాన్ని తీసుకునే విధంగా కషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ లు మల్లీశ్వరి, తహారా బేగం అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.