Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అధ్యక్షుడి నివాసం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అభివద్ధి నిరోదకులుగా మారి ఇష్టం వచ్చినట్లు సీఎంపైనా, మంత్రులపైనా మీడియా ఎదుట నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మల్లారెడ్డిపై రేవంత్‌రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాలును స్వీకరంచని కాంగ్రెస్ నాయకులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయటం వారి దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. ములుగు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని కుడుముల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శి కోడం సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ, నాయకులు కుంట ఏడుకొండలు, అమిలి చంద్రం, ఇంతియాజ్, ఎగ్గడి అర్జున్, ఊడుగుల శ్రీనివాస్ యాదవ్, మార్పుల వెంకట్‌రెడ్డి, కెక్కం జగదీష్, శానం నరేందర్, బెల్లి కుమార్, మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.