Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారం భం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మేరకు మైనర్ రిపేర్లు చేయించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలం లో శుక్రవారం ఆమె విస్తతంగా పర్యటించారు. తొర్రూరు మున్సిపాల్టీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలను సంద ర్శించి పరిశుభ్రతను పరిశీలించారు. కంప్యూటర్ విభాగాన్ని, భోజనాల గదిని సందర్శించి సూచ నలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల రాకను పండుగ వాతావరణంగా నిర్వహించా లని చెప్పారు. అలాగే పల్స్ ఆక్సీమీటర్లను, థర్మామీటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్య సిబ్బందితో పరీక్షలు చేయించాఆలని తెలిపారు. మాస్కులు, శానిటైజర్ వినియోగించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మెన్ రామ చంద్రయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్, డీఈఓ సోమ శేఖర శర్మ, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ఎంపీడీఓ భారతి, డీఈ అరుణ్‌కుమార్, మున్సి పల్ వైస్‌చైర్మెన్ సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.
తొర్రూర్ టౌన్ : మడిపల్లిలోని పీహెచ్‌సీని కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. గ్రామంలోని పాఠశాలలోని మరుగుదొడ్లను సందర్శించి సూచనలు అందించారు. కలెక్టర్ వెంట జెడ్పీటీసీ శ్రీనివాస్, డీఈఓ సోమశేఖర శర్మ, ఎంపీడీఓ భారతి, డీఈ అరుణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు సురేందర్, సర్పంచ్ వేల్పుల అంజలి ఐలయ్య, తదితరులున్నారు.
నెల్లికుదురు : మండల కేంద్రం నుంచి బొడ్లాడ వరకు నిర్మించిన రహదారి పనులను ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి బహత్ పల్లె ప్రకతి వనం కొరకు కేటాయించిన స్థలాన్ని మ్యాపు ద్వారా పరిశీలించి సూచనలు అందించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ రఫీ, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, లక్ష్మణ్, ఏఎన్ఎం భూలక్ష్మీ, తదితరులున్నారు.