Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియా హరిసింగ్ నాయక్ ఆదేశానుసారం రైతు ఆత్మ కమిటీలను ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... జిల్లా ఆత్మ కమిటీ మెంబర్ గా ఏనుగుల ఐలయ్య, బానోతు శ్రీను, మండల ఆత్మ కమిటీ మెంబర్ గా రామచంద్రుల శ్రీనివాస్, శుద్ధ పెళ్లి నారాయణ రెడ్డిలను ఎన్నిక చేస్తూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యేకు లిఖిత పూర్వకంగా పంపించడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ తాతా గణేష్, మండల పార్టీ అధ్యక్షులు రెంటాల బుచ్చి రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు బత్తిని రామమూర్తి గౌడ్, కార్యదర్శులు తిరుమల ప్రభాకర్ రెడ్డి, బాణోత్ మురళీకష్ణ, పొడుగు సుగుణ, తంగళ్ళపల్లి ఉపేందర్, ఎంపిటిసి తిరుమల శైలజ రెడ్డి, సర్పంచ్ దనసరి కోటమ్మ, సుజాత, ఉప సర్పంచ్ వీరభద్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుకుపల్లి రవి, మండల పార్టీ యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, రవి, వశ్య తదితరులు పాల్గొన్నారు.