Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ బొల్లం రమేష్ కుమార్‌యాదవ్
నవతెలంగాణ-ధర్మసాగర్
ప్రజలందరూ దేశంలో రాష్ట్రంలో జరిగే విషయాల పై అవగాహనను కలిగి ఉండాలని సీఐ బొల్లం రమేష్ కుమార్‌యాదవ్ అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని విలీన గ్రామం ఉనికిచర్ల గ్రామంలో సీపీ తరుణ్ జోష్ ఆదేశాల మేరకు జాగృతి పోలిస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పై చైతన్యపరిచేలా ప్రదర్శనలు నిర్వహించారు. మూఢనమ్మకాలు ,కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,హరితహారం, సైబర్ క్రైమ్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. మ్యాజిక్ షో డయల్100, సీసీ కెమెరాలు, గుట్క, గంజాయి, యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగావొద్దని, తదితర సామాజిక అంశాలపై పాటల ద్వారా వివరించారు. ట్రెయినీ ఎస్సై లక్ష్మి, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.