Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ ఏరుకొండ రవీందర్
నవతెలంగాణ-ఆత్మకూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న నిరంకుశ వైఖరీకి ప్రజలు చరమగీతం పాడుతారని ఆత్మకూర్ పీఏసీఎస్ చైర్మెన్ ఏరుకొండ రవీందర్ అన్నారు. శనివారం పరకాల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా సత్యాగ్రహ దీక్షను నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండాల క్రాంతి ఆధ్వర్యంలో గూడెప్పాడ్ సెంటర్ వద్ద శనివారం నిర్వహించారు. ఈ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేసీఆర్ గారఢ మాటలు ప్రజలు నమ్మొద్దని అన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పీసీసీి చీఫ్ రేవంత్ నాయకత్వంలో యువత పెద్దయెత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పట్ల విసిగిపోయారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందన్నారు. చౌళ్ళపెల్లి సర్పంచ్ కంచ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు భగవాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.