Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
ఇల్లంద గ్రామ సంఘాల పనితీరు అద్భుతమని డీఆర్డీఓ మట్టపల్లి సంపత్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో సరస్వతి గ్రామైక్య సంఘం ఆర్థిక సహాయంతో శ్రీ మణికంఠ సంఘం సభ్యురాలు కొంగ రజిత రూ.5లక్షల80వేలతో ఏర్పాటు చేసుకున్న తరుణి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ బోటిక్ సెంటర్, మదీనా జ్యూస్ సైడ్ పైడ్ రైస్ సెంటర్‌ను అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్‌తో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రోత్సహిస్తున్న దని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పెద్ద మొత్తాలతో వ్యాపా రాలు నిర్వహించుకునేందుకు మహిళలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇల్లంద గ్రామ సంఘాలు, వివోఏలు, సి.సి. పనితీరు పనితీరు అద్భుతమని కితాబిచ్చారు. డీపీఎంలు దయాకర్, భవాని, ఏపీఎం వేణు, సీసీ గోలి కొమురయ్య, వివో ఏలు తక్కలపెల్లి శోభ, పద్మావతి, స్రవంతి, రమ్య, తదితరులు పాల్గొన్నారు.