Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓ డెబోరా
నవతెలంగాణ-బయ్యారం
సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు ప్రారంభమౌతాయని సీడీపీఓ డెబోరా తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాల్య వివాహాలను ముందస్తుగానే నిరోధించాలని, ఈ విషయాలపై అన్ని మతాల పెద్దలకు అవగాహన కల్పించామని చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ వల్ల కలిగే నష్టాల గురించి కిషోర బాలికలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏడబ్ల్యూసీ నిర్వహణ జరుగుతుందని వివరించారు. భ్రూణ హత్యలు, అబార్షన్ గురించి, ఇద్దరు ఆడ పిల్లలున్న మూడవ కాన్పు తల్లులకు ఆడపిల్లల్ని అమ్మకానికి ఉంచటం చట్టరీత్య నేరమని తెలుపటం జరిగిందన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్ 1098-చైల్డ్‌లైన్, 14567-సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ ద్వారా ప్రజలు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో సూపర్వైజర్లు సుగుణ, కావ్య, చైల్డ్ లైన్ మెంబర్ వీరన్న, పాస్టర్, పూజారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.