Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
టీఆర్ఎస్ పార్టీని వీడిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడారు. నియోజకవర్గంలో టిఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయుటకు సెప్టెంబర్ 2 నుంచి కమిటీలు వేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2001లో పిడికెడు మట్టితో ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ నేడు సముద్రంలాగా పెరిగిందన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. పార్టీలో పదవులు అనుభవించి అన్ని సౌకర్యాలు పొంది విడిపోతే పట్టించుకునేది లేదన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 30 వ తారీఖు వరకు టిఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికలు ఉంటాయని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు పదవులలో సముచిత స్థానం ఉంటుందన్నారు. సమావేశంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, బీరవెల్లి భరత్ కుమార్రెడి,్డ నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు ప్రియాంక, సుచిత్ర, శ్రీనివాస్‌రెడి,్డ శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీపీలు మౌనిక, మాధవి, చంద్రమౌళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీరుద్దీన్, వెంకట్‌రెడి,్డ టీఆర్ఎస్ నాయకులు మార్నేని రఘు, రవి, రాజు, అశోక్ పాల్గొన్నారు.