Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ-చిన్నగూడూరు
ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చైతన్యం కలిగించాలని కరోనా రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కరోనా బారిన పడి భారీ సంఖ్యలో జనం మృతి చెందారని చెప్పారు. కరోనా వల్ల రెండేండ్లపాటు విద్యాసంస్థలను మూసేయాల్సిన వచ్చిందన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు సహా పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మండలంలోని అన్ని పాఠశాలలను శానిటైజ్ చేసేలా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. పశువైద్యాధికారిపై ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేయగా అతడు సమావేశం మధ్యలోనే వెళ్లిపోగా కలెక్టర్‌కు, ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓకు ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ జలాలు అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు. కోరారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు సమర్ధవంతంగా పని చేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మంగపతిరావు, వైస్ ఎంపీపీ వీరయ్య, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సరస్వతి, 10 గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.