Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా దళితుల ఓట్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అనుమానం వ్యక్తం చేశారు. దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకుని తదనంతరం విస్మరించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాలు చొప్పున భూపంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తదితర అనేక హామీలతో ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని తదనంతరం దళితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్న క్రమంలో పలు చోట్ల ప్రజలు చైతన్యవంతులై టీఆర్ఎస్ను ఓడించగా హుజురాబాద్ నియోజకవర్గంలో గెలుపును సీఎం కేసీఆర్ డబ్బుతో కొనచూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడుభూములకు పట్టాలిస్తామని గిరిజనులకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా పోలీసు, అటవీ శాఖ అధికారులను ఉసిగొల్పి దాడులు చేస్తూ తప్పుడు కేసులు బనాయింపజేశారని తెలిపారు. రైతులను, కార్మికులను, యువజనాన్ని, విద్యార్థులను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజలు టీఆర్ఎస్కు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం సాయంత్రం దీక్షను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవిచందర్‌కు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, సర్పంచ్ రత్నం భద్రయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకుపెల్లి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు జక్కుల రేవంత్ యాదవ్, బొమ్మకంటి రమేష్, వంశీ, అజరు, రమణాకర్, కోడి సతీష్, వంశీకష్ణ, శ్రీకాంత్, సిద్ధం రాఘవేందర్, కోటి, కిషన్‌రెడ్డి, రాము, ప్రతాప్, చింతా క్రాంతి, చంద్రకాంత్, తారక్, శ్రీధర్, గోవర్ధన్, సుధాకర్, రాజేందర్, శంకర్, రవి, మహబూబ్, రాహుల్, గణేష్, రాకేష్, బాలరాజు, నూనావత్ శ్రవణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కురవి : మండల కేంద్రంలోని గుడి సెంటర్లో యూత్ కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షుడు చిర్రా సురేష్ ఆధ్వర్యంలో దళిత, గిరిజన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దీక్షలకు మండల ఉపాధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ నారాయణ రాజేంద్ర కుమార్, మాజీ జెడ్పీటీసీ అంబటి వీరభద్రం, యూత్ మండల నాయకులు అంగడి నర్సయ్య, మహేందర్ రెడ్డి, గంట యాకేష్యాదవ్, రాము నాయక్, దోమల లక్ష్మణ్, బిక్కునాయక్, బోధ శ్రీను, రాములునాయక్, శ్యామల శ్రీనివాస్, అవిరా మోహన్‌రావు, బాబ్ జాన్, బండి శ్రీను సంఘీభావం తెలపగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నీరుడు ప్రేమ్‌కుమార్, దుంపటి వీరన్న, చింతమల్ల నారాయణ, కోర్ని అనిల్‌కుమార్, పొలెపాక ప్రశాంత్, చెరుకుపల్లి మోహన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కమాండ్ల వీరన్న, నాయకులు దగ్గుల అనిల్‌కుమార్, మనోజ్, నాగరాజు, నరేష్, మధు, శ్రావణ్, సిద్దు, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘానాపురం : మండల కేంద్రంలో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగాపురం ఇందిర, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జగదీష్‌చందర్‌రెడ్డి, దళితబంధు నియోజకవర్గ కోఆర్డినేటర్ చిలువేరు కృష్ణమూర్తి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీటీసీ లు నర్సయ్య, భిక్షపతి పాల్గొన్నారు.