Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
జిల్లాలో ఏడేండ్లలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దానికంటే ఎమ్మెల్యే సీతక్క ఎక్కువ అభివద్ధి చేయడంతో పాటు నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో నిత్యం పాలుపంచుకున్నదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివద్ధి నిధులివ్వని దౌర్బాగ్య ప్రభుత్వం కేసీఆర్‌దే నన్నారు. ప్రభుత్వం సీడీఎఫ్ నిధులు ఇవ్వకున్నా ఎమ్మెల్యే సీతక్కకు రాష్ట్ర స్థాయిలోని ముఖ్యకార్యదర్శలతో ఉన్న పరిచయాలతోనే నియోజకవర్గంలో ఇప్పటి వరకు వంద కోట్లకు పైగా అభివద్ధి పనులు సాంక్షన్ చేయించిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా ఎమ్మెల్యే ఏమి అభివద్ధి చేసిందని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు గడచిన ఏడేళ్లలో ప్రభుత్వం చేసిన అభివద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని జయరాంరెడ్డి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్కను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్‌ను గెలిపిస్తే ములుగు జిల్లా చేస్తానని చెప్పినా ప్రజలు సీతక్కను గెలిపించారంటే సీతక్కకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని తమ ప్రభుత్వంలో సీతక్క హోమ్ మంత్రి కావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితంలేని మాటలకు స్వస్తి చెప్పి అబివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు అయ్యోరి యానయ్య, చాద మల్లయ్య, ఎంపెల్లి సమ్మయ్య, తూడి భగవాన్‌రెడ్డి, ఆదినారాయణ, హిదాయతుల్లా, వీరగాని వెంకటేశ్వర్లు, లక్ష్మీపతి పాల్గొన్నారు.