Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
మండలం లోని సింగారం గ్రామ పంచాయతీ మద్దిమాడుగు కోయాగుడెంకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పొలం రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం రోడ్డుపై నాగండ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మద్దిమడుగు గ్రామం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు, మంచినీరు, కరెంట్ సౌకర్యం కల్పించలేదన్నారు. స్థానిక ఆదివాసీ గిరిజనులకు చట్టం ప్రకారం పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని అన్నారు. గ్రామం లో మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని , ప్రత్యేకంగా ఒక ఆశ వర్కర్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుటే పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు బుదారం, భీమయ్య సోమయ్య, సోని,బ తదితరులు పాల్గొన్నారు.