Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గైర్హాజరైన ఎంపీపీలు, పలువురు ప్రభుత్వ శాఖాధికారులు
నవతెలంగాణ-హన్మకొండ
ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత వహించాల్సిన సర్వసభ్య సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్ పర్సన్ మారేపల్లి సుధీర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి బాధ్యతగా హాజరు కావలసిన ప్రజా ప్రతినిధులు వేలాది వేతనాలు తీసకుంటున్న ప్రభుత్వ శాఖ అధికారులు కూడా డుమ్మా కొడుతున్నారు. ఏడుగురు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఒక్కరే హాజరయ్యారు. దీంతో వచ్చిన కొద్ది మంది ప్రజా ప్రతినిధుల సమస్యలపై సమాధానం చెప్పాల్సిన ప్రభు త్వ సహకారం రాకపోవడంతో సభ మొక్కుబడిగా సాగుతోంది. సభ ప్రారంభం కాగానే ముందుగా వ్యవసాయశాఖ విద్యాశాఖ అధికారు లు, ఆరోగ్య శాఖ అధికారులు తదితర ప్రభుత్వ అధికారులు తమ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశం ముల్కనూరు, వంగర గ్రామాలలో 30 పడకల ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు సభ తీర్మానం చేసింది. ఈ సమయంలో ప్రజలకు సేవ చేసిన వైద్య శాఖ అధికారులను అభినందించారు. భీమదేవరపల్లి జెడ్పీటీసీ వంగ రవి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో నగరంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు అమానవీయంగా ప్రవర్తించాయని, మధ్యతరగతి కుటుంబాలు భూములు, బంగారాన్ని అమ్ముకుని చికిత్సకు చెల్లించారని అన్నారు. అయినా ఒక్క ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు చనిపోయారని అన్నారు. వైద్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయాలని అన్నారు.
ఎక్సైజ్ శాఖ పై గరం గరం
ఎక్సైజ్‌శాఖపై దాదాపు అందరు సభ్యులు గరంగరం అయ్యారు ప్రతి గ్రామంలో 20 నుంచి 30 బెల్టుషాపులు నడుస్తున్నాయని వైన్ షాప్‌లతో వారు కుమ్మక్కై అధిక ధరలకు అమ్ముతున్నారని వేలేరు జెడ్పీటీసీ సరితా అన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులను నియంత్రించాలని కోరారు. జెడ్పీ వైస్ ప్రెసిడెంట్ గజ్జెల్లి శ్రీనివాస పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులపై మండిపడ్డా రు. రైతు వేదికలను పూర్తి చేసిన వారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. అనంతరం డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.