Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్
నవతెలంగాణ-బయ్యారం
విప్లవ ఆదర్శ కమ్యూనిస్టు చేపూరి రంగన్న అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్ అన్నారు. విప్లవోద్యమ తొలి తరం కార్యకర్త రంగన్న సంతాప సభ ఆదివారం మండల పరిధిలోని కారుకొండ గ్రామంలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోవర్ధన్ మాట్లాడుతూ రంగన్న మరణం భారత విప్లవోద్యమానికి తీరని లోటన్నారు. ఆయన నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో సౌకర్యాల కోసం ఉద్యమించి కేసుల పాలై జైలు జీవితం గడిపారని తెలిపారు. రంగన్న ఆశయాలను నెరవేర్చడానికి ప్రతిఘటన పోరాటాల దిశగా ప్రయాణించి నిజమైన నివాళ్లర్పించాలని సూచించారు. సభలో మాజీ జెడ్పీటీసీ, పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జిల్లా నాయకులు జగ్గన్న, పద్మ, మదార్, జడ సత్యనారాయణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు సీతారామయ్య, పొమ్మన్న, భిక్షం, నాగేశ్వర్రావు, నర్సింహ, తుడుం వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.