Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రాజకీయాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న మానుకోటలో వేడి రగులుకుంది. రాజకీయాలంటేనే పెదవి విరిచిన వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉత్సాహంగా వీక్షిస్తున్నారు. వెరసి రాజకీయ సందడి నెలకొందని చెప్పక తప్పదు. ఓపక్క గులాబీ గూటిలో గుసగుసలు వినిపిస్తుండగా మరోపక్క కాంగ్రెస్ కోటలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి అర్ధాంతరంగా కారు దిగిపోయారు. కాంగ్రెస్‌కు జీవం పోసి సమరశంఖం పూరించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తం అందుకుని మానుకోట కాంగ్రెస్‌లో కొత్త ఆశలకు వేదికగా నిలిచారు. వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్రెడఇడ, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి సమక్షంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. జిల్లాలో రాజకీయంగా గట్టి పట్టున్న శ్రీకాంత్‌రెడ్డి టీఆర్ఎస్ నీళ్లొదిలి కాంగ్రెస్‌లో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంత్‌రెడ్డి ఏ మేరకు ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల ములుగు ఎమ్మెల్యే సీతక్క మానుకోటలో విస్తతంగా పర్యటిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ బలోపేతానికి కషి చేస్తున్నారు. పార్టీ మారిన శ్రీకాంత్‌రెడ్డి టీఆర్ఎస్ లైవ్ స్వేచ్ఛ లేదని, స్వాతంత్రం కనిపించడం లేదని, నియంతత్వం పెరిగి పోయిందని, వ్యక్తిపూజ అధికంగా ఉందని, పార్టీ విధానాలు అమలు కావడం లేదని విమర్శలు చేశారు. కార్యకర్తలు అనేక అవమానాలు పాలవుతున్నారని వాపోయారు. పని చేసిన నాయకులకు గుర్తింపు లేదని, ఆత్మాభిమానం చంపుకుని పార్టీలో పని చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా పార్టీ వీడతారని ప్రచారంలో ఉంది. వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ప్రభావంతో గులాబీ నాయకత్వం మేల్కొన్నటుగా కనిపిస్తోంది. సంస్థాగతంగా పని చేసిన కార్యకర్తల గుర్తింపు ఇవ్వాలని, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలకు సీడీఎఫ్ కాంటాక్ట్ వర్క్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తరహాలోనే శ్రీకాంత్‌రెడ్డి రాజకీయాలను ప్రభావితం చేస్తారని చర్చ జరుగుతోంది.