Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొనసాగిన దళిత,
గిరిజన ఆత్మగౌరవ దండోరా
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. జిల్లాలోని మల్లంపల్లి, మహ్మద్ గౌస్‌పల్లి గ్రామాల్లో కార్యక్రమ ఇన్‌ఛార్జి, టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ కూచన రవళిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమానికి సీతక్క ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితుల, గిరిజనులకు అనేక హామీలు విస్మరించారని వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే దళితులకు, గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు.
మృతుల కుటుంబాలను సీతక్క పరామర్శ
మండలంలోని మల్లంపల్లిలో వనపాకల అమూల్య ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క, జిల్లా దళిత గిరిజన దండోరా ఇన్‌ఛార్జి కూచన రవళిరెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టెవాడ తిరుపతి, చక్రపు రాజు, మేడం రమణాకర్, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు చంద రాము, ఉపాధ్యక్షులు మంద కుమార్, అంకం సురేష్, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, వార్డు వార్డు సభ్యుడు నూనె ఐలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల అనిల్‌రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, నాగుల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వనమా వేణు శ్రీనివాస్, శ్యాంరావు, గోల్కొండ రవి, ముత్యాల వెంకన్న, రాంరెడ్డి, గూడెపు రాజిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, లాదా లక్ష్మణ్, కొంగరి నరేందర్, పైడి తాళ్లపల్లి సాంబయ్య, కుమార్, ఎంపెల్లి ఎల్లయ్య, డాక్టర్ రవిబాబు, దేవేందర్, ఐత భద్రయ్య, నాయకులు కోయిల ఇంద్ర, కొంగరి సుమలత, వనపాకల సుజాత, మహమ్మద్ గౌస్‌పల్లి సర్పంచ్ శైలజ సురేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పు మొగిలి, మేకల ప్రశాంత్, ముంజాల కుమార్, జెట్టి వినరు, ఎర్రబెల్లి సదయ్య, శ్రీపతి దేవేందర్, బండారి రాజయ్య, మైబు, పుట్ట మల్లయ్య, నారాల సదయ్య, జంపాల మధు, పసుల చిరంజీవి, రొట్టె కిరణ్, రాజమౌళి, మామిడాల బుచ్చయ్య, ఎర్ర బుచ్చయ్య, కనకం సదయ్య, రొట్టె రమేష్, నర్రా రవిశంకర్, బసిడి వంశీ, మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.