Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల్లోని కడిపికొండ, మడికొండ, సోమిడి, బాపూజీనగర్, బట్టుపల్లి, ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మడికొండ పాత పోలీస్ స్టేషన్ దగ్గర పోచమ్మ బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి కమిటీకి ప్రత్యేకఏర్పాట్లు చేయడం పట్ల పలువురు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బుర్ర రాజేందర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి నర్మెట బిక్షపతి, మూల ఆయిలయ్య, కొలిపాక వెంకటస్వామి, ముంజ రమేష్, బొల్లికొండ వినోద్‌కుమార్, కామిని మల్లేష్ పాల్గొన్నారు. అలాగే 44, 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ గ్రామస్తులు పోచమ్మతల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్‌శర్మ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ పోచమ్మతల్లిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే 63వ డివిజన్ పరిధిలోని బాపూజీనగర్‌లోని పోచమ్మతల్లి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ విజయశ్రీ రజాలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాపూజీ నగర్ ప్రాంత ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. 62వ డివిజన్ పరిధిలోని సోమిడిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్‌యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే 47 డివిజన్లో బోనాల పండుగలు ఘనంగా నిర్వహించి పోచమ్మతల్లికి స్థానిక కార్పొరేటర్ నర్సింగ్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.