Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర అర్థరహితమనిఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనాదక్షత లేదని, మీడియా దృష్టి సారించడానికి బండి సంజరుతో పాటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాకులాడుతున్నారని తెలిపారు. బండి సంజరు చేపట్టిన సంక్షేమ యాత్ర హైదరాబాదులో ప్రారంభమైందని, తెలంగాణలో అవసరం లేదని, ఈ యాత్ర ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోదీ వద్దకు చేరాలని ఆయన సూచించారు. యాత్ర పోలీస్ వ్యవస్థ లేకుండా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బండి సంజరు భారత ప్రభుత్వ పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నారని, రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మీరు తీసుకున్న నిర్ణయం భారత దేశ ప్రజలకి అన్నం పెడుతున్న రైతుల నడ్డి విరిచే చట్టాలు తీసుకువచ్చారని ఆరోపించారు. ఎవరైనా ఉద్యమాలు చేస్తే వారితో కూర్చుని చర్చలు చేసి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్చలు చేయడం లేదని ఆయన అన్నారు. ఢిల్లీ పుర విధుల్లో సంవత్సర కాలం నుండి రోడ్డు మీద దీక్షలు చేపడుతున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కోల్పోయిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను హర్యానా రాష్ట్రంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే తలలు పగలగొట్టాలని కానీ వారికుండే ప్రజాస్వామ్య హక్కులను ఎందుకు కాపాడ లేదని ఆయన అన్నారు. మీరు తీసుకొచ్చిన సాగు నీటి చట్టాలు, వ్యవసాయ చట్టాలు, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2014లో రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరచారని అన్నారు. 75సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో మొదటి ప్రధాని పండిట్ జవహర్ నెహ్రు నుంచి మనోహన్ సింగ్ వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అనేక పరిశ్రమలు బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్, బీహెచ్ఎన్ఎల్ లాంటి ఎన్నో సంస్థలను ప్రవేశ పెట్టి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని వివరించారు. మీ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు దేశాన్ని అమ్మే దిశగా తీసుకుళ్లిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. కరోనా రెండో దశ దేశంలో వచ్చి దేశ ప్రజల ఆరోగ్యంపై పడుతుందని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్యశాఖ అధికారులు మీకు మొరపెట్టినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మీ పేరుకోసం ఇతర దేశాలకు భారత దేశంలో తయారు చేసిన వాక్సిన్లను ఇతర దేశాలకు పంపడం వలన రెండో దశ కరోనా ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, దానికి కారణం మీరు కదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రెయివేటు పరం చేయడం విరమించుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతూ నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యం తగదు : ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి జిల్లా ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం చేయరాదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. భూపాలపల్లి గణపురం రేగొండ మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు దాదాపు 11లక్షల 47వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ... సొంత ఖర్చులతో వైద్యం చేసుకుని ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రికి ప్రజల తరుపున ప్రత్యేక కత్ఞతలు తెలిపారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవడంలో, కరోనా విషయంలో జాగ్రత్తగా లేకుండా నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరమని ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్.వెంకట రాణి, వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సాంబమూర్తి, ఎంపీపీ యం.లావణ్య, వైస్ గణపురం మండలపార్టీ అధ్యక్షుడు పోలుసాని నరసింహారావు, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేష్‌గౌడ్, సాగర్‌రెడ్డి, సిద్ధూ, కౌన్సిలర్లు రవీందర్‌గౌడ్, రవికుమార్, నూనె రాజు, అనిల్, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జిల్లా సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, టీజీబీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.