Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కను విమర్శించే స్థాయి జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి లేదని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కొర్నిబెల్లి నాగమణి, వైస్ ఎంపీపీ పాక కాంత, కామారం, తాడ్వాయి సర్పంచ్‌లు రేగ కళ్యాణి, ఇర్ప సునీల్ దోర అన్నారు. మండల కేంద్రంలో అదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీలకు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. కొద్ది రోజులుగా పదే పదే జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగజ్యోతి విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాగజ్యోతికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని చెప్పారు. కాల్వపల్లి సర్పంచ్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సీతక్కని గుర్తు పెట్టకోవాలని హితవు పలికారు. ఆదివాసీలకు సీతక్క చేసిందేమీ లేదని విమర్శిస్తున్న నాగజ్యోతి వైస్ చైర్‌పర్సన్‌గా స్వగ్రామంలోనైనా ఏం అభివృద్ధి చేశావో చెప్పాలన్నారు. రెండేండ్లుగా ఆదివాసీ గూడాల్లోని కరోనా బాధితులను ఆదుకుంటున్న ఘనత సీతక్క సొంతమన్నారు. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్‌కు చెందుతుందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పోడుభూములను లాక్కుంటూ ఆదివాసీ రైతులపై పోలీసులు, అటవీ శాఖలతో దాడి చేయించినట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలూ సీతక్కను ఆడబిడ్డగా ఆదరిస్తుండగా తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చైర్పర్సన్ స్థాయి నాయకురాలిగా పక్క రాష్ట్రాల గురించి మాట్లాడే అర్హత జ్యోతికి లేదన్నారు. పత్రిక ప్రకటనలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. మరోసారి సీతక్కపై విమర్శలు చేస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశం ఎంపీటీసీ మెశెట్టి జయమ్మ, అంకంపల్లి, పంబాపూర్, నర్సపూర్, లింగాల, రంగాపూర్ సర్పంచ్‌లు వట్టం సావిత్రి, ఇర్ప అశ్విని, ఊకే మౌనిక, మంకిడి నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.