Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రీడలతో ఆరోగ్యం : ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి
నవతెలంగాణ-ఏటూరునాగారం
ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కోరారు. సమాజంలోని ప్రతిఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలని ఆయన కోరారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఏటూరునాగారంలోని వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 2కే రన్‌ను ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్థానిక జెడ్పీ హైస్కూల్లో పిల్లల, సభ్యుల సమక్షంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కేక్ కట్ చేసి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం విజేతలకు బహుమతులు అందించారు. యశ్వంత్ మొదటి, సిద్దూ రెండో, రోహిత్ తృతీయ, మీనాల్శ్రీ ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని యువత క్రీడల్లో రాణించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోచ్ పర్వతాల కుమార్, సభ్యులు సిరాజ్, చితమట రఘు, పర్వతాల లాలయ్య, వావిలాల ఎల్లయ్య, వావిలాల సాంబశివరావులు, సయ్యద్ సర్దార్ పాషా, వాసంపల్లి సాంబశివరావు, శ్రీరామ్, కొయ్యడ మల్లయ్య, శ్రావణ్, భిక్షపతి, రాజబాబు, చందర్, నరేష్, గంపల నర్సయ్య, హన్మంతు, వలస మధు తదితరులు పాల్గొన్నారు,