Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
నియోజకవర్గ పరిధిలో ఎవరు అభివృద్ధి చేసినా ఆ లెక్క తన ఖాతాలోకే వస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివద్ధి పనులకు గానూ సీజీఎఫ్ నిధులు రూ.50 లక్షల పనులకు ఆలయ చైర్మెన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో విశిష్ట అతిథిగా జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివద్ధి అధికారి లక్ష్మిప్రసన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బుగులు వెంకటేశ్వర ఆలయం మరో తిరుపతిగా అభివృద్ధి చెందేందుకు తన సహకారం ఉంటుందని చెప్పారు. ఆలయ రూపురేఖలు మార్చి వైభవం తీసుకురావాలని పాలకమండలికి సూచించారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల రూపురేఖలు మారిన తీరులోనే రాష్ట్రంలో అన్ని ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలయాల అభివద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి ఐకాన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్ర సాధనలో తన వంతుగా అధికార పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, అధినాయకులు కేసీఆర్, హరీష్, కేటీఆర్ తన గెలుపుకై స్వయంగా కషి చేశారని అన్నారు. కడియం శ్రీహరి కూడా తన కోసం చక్కగా పని చేస్తున్నారని తెలిపారు. తన పదవి ముగిసినా ఈ ప్రాంతం కోసం పని చేస్తానని వస్తునందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మెన్ రవి, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, ధర్మకర్తలు కలకొల పోచయ్య, సర్పంచ్ ఉద్దేమారి రాజ్‌కుమార్, ఎంపీటీసీ జీడి ఝాన్సీ, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, చేరాలు, రంగు రమేష్, వేల్పుల గట్టయ్య, మోతె శ్రీనివాస్, ఆనందం, రంగు హరీష్, తదితరులు పాల్గొన్నారు.