Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ క్రీడాకారులకు ఆదర్శప్రాయుడని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి (డీవైఎస్ఓ) పీవీ రమణాచారి కొని యాడారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ధ్యాన్‌చందర్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడారు. మేజర్ ధ్యాన్‌చంద్ భారత దేశ కీర్తిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేశాడని కీర్తించారు. ఒలింపిక్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించారని తెలిపారు. క్రీడా చరిత్రలోనే జీవితకాల క్రీడా పురస్కారం (అవార్డ్) అందుకున్న ఏకైక క్రీడాకారుడిగా అభివర్ణించారు. యువత ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని రాణించాలని సూచించారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ చల్లగరుగుల సాంబయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మామిడిపెల్లి రమేష్, క్రీడాకారులు వేణు, రాములు, జగదీష్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు : సీఐ
కొత్తగూడ : క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గూడూరు సీఐ రాజిరెడ్డి తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుండి గుంజేడు రోడ్డు వరకు 2కే వాక్‌థాన్ నిర్వహించగా సీఐ రాజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి అథ్లెటిక్స్, 2కే రన్ విజేతలకు విజేతలకు శాలువాలు కప్పి సన్మానించి మెమెంటోలు అందజేశారు. అనంతరం కరాటే విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రమోహన్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసం స్వామి, ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్జ సురేందర్, సర్పంచ్ మల్లెల రణధీర్, ఎంపీటీసీ హలావత్ సాలుకి సురేష్, పీడీలు కొమ్మాలు, వెంకన్న విజయ, వెంకటేశ్వర్లు, పీఈటీలు మహేందర్, సుధాకర్, నరేష్, సుమలత, శ్వేత, రజిత, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : ప్రభుత్వ బాలికల పాఠశాలలో 'మా' అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపెల్లి ఉపేంద్రం అధ్యక్షతన క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. జిల్లాను క్రీడాకారులకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని అవగాహన కలిగి ఉండాలని, క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలునాయక్, పుష్పలీల, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : మండల కేంద్రంలో క్రీడాపోటీలు నిర్వహించారు. బాక్సింగ్ కోచ్ రమేష్, పీడీ సంగ చేరాలు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యుడు బాబురావు, సలేందర్, క్రీడాకారులు చంటి జాన్, జన్ను ప్రవీణ్, చంటి వివేక్, ప్రణరు, సన్నీ, చందర్, బన్ని, సిద్దు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.