Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ఫంక్షన్ హాల్లో హన్మకొండ రెడ్ క్రాస్ సోసైటీ, సంజీవని సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 180 యూనిట్ల రక్తాన్ని దాతల నుండి సేకరించారు. సంజీవని సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ కీర్తి శ్రవణ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్ర మంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లా డారు. సంజీవని సేవా సమితి ట్రస్ట్ ఏడు సంవత్సరాలుగా కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా చేస్తున్న సేవలను అభినందిం చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఈ రక్త దాన శిబిరం ఎంతోమంది ప్రాణా లను కాపడుతుందన్నారు. కాటారం సర్పంచ్ తోట రాధమ్మ, సీఐ రంజీత్రావు, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహదేవ పూర్ జెడ్పీటీసి గుడాల అరుణ, కాటారం ఎస్సై సాంబమూర్తి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జక్కు రాకేష్, కాటారం మెడికల్ ఆఫీసర్ రామారావు, ఎంపీటీసీలు తోట జనార్దన్, విజయ, మహేశ్వరీ, రవీందర్ రావు, సర్పంచ్లు రవి, అశోక్, కాటారం ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్ ,హన్మకొండ రెడ్ క్రాస్ సోసైటీ మొటివేటర్ శ్రీనివాస్ , సిబ్బంది పాల్గొన్నారు.