Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నవతెలంగాణ-నర్సింహులపేట
పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మండలంలోని పడమటిగూడెం గ్రామానికి చెందిన జక్కుల యశ్వంత్, ఉప్పలయ్యలకు ఉగ్గంపల్లిలోని తన నివాసంలో మంగళవారం ఆయన రూ.2 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు టేకుల యాదగిరిరెడ్డి, పడమటిగూడెం ఎంపీటీసీ పాతూరి మధు, నాయకులు అక్కిరెడ్డి వెంకట్రెడ్డి, జొన్నలగడ్డ వెంకన్న, కుంభాల శ్రీశైలం, జక్కుల యాకన్న, అబ్దుల్ రెహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.