Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
57 ఏండ్లు నిండిన వ్యక్తులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సైదులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందక, ఇతర పలు కారణాలతో పలువురు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో వేలిముద్రలు పడకపోతే ఆధార్ కార్డు అప్లికేషన్ ద్వారా తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం మండల అధ్యక్షులు అశోక్, నాయకులు విస్సంపల్లి వెంకటయ్య, పుల్లయ్య, కుమార్, తదితరులు పాల్గొన్నారు..
తొర్రూరు : 57 ఏండ్లు నిండిన వ్యక్తులు ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని వ్యకాస మండల కార్యదర్శి యాకూబ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో యాకూబ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 తేదీ వరకు గడువు విధించిందని, పలు కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. సమావేశంలో సంఘం నాయకులు దర్గయ్య, సురేష్, విజరు, శ్రీను, వెంకన్న, ఎల్లయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.