Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు మిట్టకంటి రాంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భరత్‌చందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణత్యాగాలపై సాధించుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగలేదన్నారు. నీళ్లు, నిధులు. నియామకాలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని చెప్పారు. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఒక వర్గానికి పరిమితమయ్యిందని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ బడుగులకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. టీఆర్ఎస్లో కార్యకర్తలు లేరని, నాయకులు పెరిగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉందని, కార్యకర్తలు పుష్కలంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. మండలంలోని కంబాలపల్లి నుంచి మాజీ ఎంపీటీసీ బెల్లంకొండ శ్రీనివాస్, చిరిక ఉపేందర్‌రెడ్డి, సోమ ఉపేందర్‌రెడ్డి, కొల్లు వెంకట్‌రెడ్డి, కమటం వెంకన్న, మలికంటి సత్యం, బెల్లంకొండ యాకయ్య, బొక్క వెంకన్న, కొత్త రమణారెడ్డితోపాటు వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్ పార్టీ నాయకులు దేవరం ప్రకాష్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు నీరుటి లక్ష్మీనారాయణ, ఎస్టీ సెల్ నాయకుడు బానోత్ ప్రసాద్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.