Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది . వర్షాలు భారీగా కురిసి చెరువులు నిండి సంతోషం అయినప్పటికీ వరి, పత్తి చేనులు మునిగిపోయి రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఐదు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 24, వేల 250 ఎకరాల వ్యవసాయ సాగు యోగ్యమైన భూమి ఉంది. ఇందులో తొమ్మిది వేల ఎకరాల్లో వరి పంట, తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల్లో పత్తి, మిగతా మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు సాగు చేస్తారు. రెండు నెలలుగా వర్షాలు లేక పత్తి పంట ఎదు గుదల లేదు. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పత్తి పువ్వు లోకి వర్షం నీరు చేరి కాయ కాకుండా ఎత్తు పెరగకుండా తీరని నష్టం వాటిల్లింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నవతెలంగాణ-మల్హర్రావు
రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఎల్ఎండి 8 గేట్లు ఎత్తివేసి మానేరుకు నీరు వదులుతున్నందువల్ల 24 వేల క్యూసె క్కుల నీరు దిగువకు వస్తున్నండటంతో మండలంలోని మానేరు తీరంలో ఉండే తాడిచెర్ల, మాల్లారం, పీవీ నగర్, వల్లెకుంట, కుంభంపల్లి ప్రాంతాల రైతులు, ప్రజలు మానేరు వైపు వెళ్ళకుండా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, కొయ్యుర్ ఎస్సై సత్యనారాయణలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన హెచ్చరించారు. పాడి పశువులను కాపరులు వెళ్లని వ్వకుండా జాగ్రత్త ఉండాలని సూచించారు.
పొంగిపొర్లుతున్న వాగులు
నవతెలంగాణ-వేలేరు
మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తుండటంతో చెరువులు 80 శాతం నీటితో నిండాయి. వేలేరు పోలిస్‌స్టేషన్ పరిధిలో వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండడంతో ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పొలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు వాగులు దాటేందుకు సహాయక చర్యలు ఏర్పాటు చేశారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అయుబ్
నవతెలంగాణ-కాశిబుగ్గ
నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలమయమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలను మంగళ వారం టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ అయుబ్ పార్టీ నాయ కులతో కలిసి పరిశీలించారు. గ్రేటర్ పరిధి 40 కాలానీలు ముంపునకు గురై ఇళ్లలోకి నీరు చేరి బాధి తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో వాహనాలతో పాటు ఓసాఫ్ట్ వేర్ ఉద్యోగి కొట్టుకుపోయి శవమై తేలడం అత్యంత బాధాకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు వరదలు నివారించడంలో పూర్తిగా విఫల మైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ను డల్లాస్ నగరం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లస్ చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. అనంతరం అయుబ్ బాధిత కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు, బియ్యం పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లన రవి, మారేడు నర్సన్న, జన్ను అదాం, కూచన రవీందర్, సందేల లాజరస్, జన్ను జీవన్, చిమ్మని వేణు, జన్ను వేణు, కిన్నెర రవి, జంగం ప్రభకర్, కుసుమా రాజు, వాసాల ఈశ్వర్ పాల్గొన్నారు.
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
నవతెలంగాణ-సంగెం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల, రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మామునూరు ఏసీపీ నరేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఏల్గుర్ రంగంపేట పెద్ద చెరువును సందర్శించారు. మత్తడి పరిసరాలను, వాహనాల రాకపోకలను పరిశీలించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంబాలను, గోడలను తాకరాదన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండొద్దని సూచించారు. పిడుగులు పడుతున్నపుడు ఎట్టి పరిస్థితిలో చెట్ల కింద ఉండరాదని తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సమ యంలో డయల్100కి ఫోన్ చేయాలని కోరారు. పీఎస్సై జీనత్‌కుమార్, పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.