Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముకు వ్యతిరేకంగా నేడు పింఛన్ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి, ఉపాధ్యక్షుడు అబ్దుల్ అలీం, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుదర్శనం ఒక ప్రకటనలో కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యా యులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీపీఎస్ విధానాన్ని అమలు చేసుకుంటామని పాత పెన్షన్ విధానం అమలు చేయదలచుకోలేదని నాటి రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ కు లేఖ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు మోసం చేసిందని తెలిపారు. ఇప్ప టికైనా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.