Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీఫ్‌విప్ వినరుభాస్కర్
నవతెలంగాణ-కాజీపేట
టీఆర్ఎస్ పాలన దేశానికి దిక్సూచి అని, తెలంగాణ గల్లీల నుండి ఢిల్లీ వరకు రెపరెపలాడనున్న తెలంగాణ ఆత్మగౌరవ పతాకం అని ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్ అన్నారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియెజకవర్గ విస్తృస్థాయి సమావేశం ఆర్ఈసాలోని తార గార్డెన్లో నిర్వ హించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, అభివృద్ధి, కార్యకర్తల సమస్యలు, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కమిటీలు వేస్తున్నామని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. పదవులు, ఉనికి కోసం ప్రతిపక్షాలు సభలు పాదయాత్రలు చేస్తున్నాయన్నారు. బీజేపీ అంటే బాత్ జాదా-బాత్ జూటా పార్టీ ఇక కాంగ్రెస్ ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లోనే కాకుండా పార్టీ సభ్యత్వలలోను దేశంలోనే టీఆర్ఎస్ నెంబర్ వన్ గా ఉందన్నారు. పశ్చిమ నియెజకవర్గంలో ప్రతి డివిజన్లో సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా ఎగురవేసి పండుగలాగా వేడుకల్ని నిర్వహించాల ని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..