Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నవతెలంగాణ కమలాపూర్
ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు పథకం వర్తిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళితబందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల ఇన్చార్జి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తిస్తుందని, దళితులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి చేకూరుతుందని అన్నారు. వివిధ పార్టీలు ఆటంకాలు సృష్టించినా మొక్కవోని సంకల్పంతో దళితులు అభివృద్ధి చెందాలని రూ. 2వేల కోట్లు సీఎం కేసీఆర్ విడుదల చేశారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దళిత బంధు పథకాన్ని చూసి అభినందిస్తున్నారని అన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, బీమా, ఉచిత కరెంటు తదితరవి ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కులవత్తులను ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని గుర్తు చేశారు. సర్పంచ్ విజయ తిరుపతిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవిలత, తాసిల్దార్ జాకీర్ పాషా, వైస్ ఎంపీపీ కళ్యాణి అశోక్, ఎంపీడీవో పల్లవి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానిన ఆదుకుంటాం
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన ఏకు రాజు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమిత మయ్యాడు. విషయం తెలుసుకొన్న ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. రాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. సీనియర్ నాయకులు మాట్ల ఐలయ్య, పుల్ల శ్రీనివాస్, ఓసుకుల డేవిడ్, మాట్ల శ్రీధర్, సురేందర్, శంకర్, దినేష్ యువరాజ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.