Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయ శిల్ప కళా సంపదను కాపాడాలని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ నాగిరెడ్డి రామ్మోహన్రావు మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెరవే రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథులుగా జయధీర్, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే హాజరై మాట్లా డారు. ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కి నెల రోజులు గడిచిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉందన్నారు. యునెస్కో గుర్తింపు పొందడంతో రాష్ట్ర మంత్రులు కొందరు పర్యటించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. రామప్ప ఆలయ చుట్టూ 50 కిలోమీటర్ల మేరకు ఓపెన్ కాస్ట్ తవ్వకాలను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆలయ చుట్టూ ఉన్న భూమిని సేకరిస్తే నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు కందుకూరి అంజయ్య, నల్లెల్ల రాజయ్య, శ్రీనివాస్, వేణుగోపాల్, పథ్వీరాజ్, మనోజం, అశోక్ రాజు, యాదగిరి, కుమార్, నాగేంద్ర శర్మ, రామలక్ష్మి, మమత, రేణు, రాధిక, రాజేశం, నందబాబు తదితరులు పాల్గొన్నారు.