Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని గురువారం స్థానిక చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలపై పరోక్షంగా పన్నులు విధిస్తూ వారి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల అనిల్, ఎంపీటీసీలు మహేంద్ర, రేవతి, రమేష్, సరోజ నాయకులు గంగాధర్ రావు పాల్గొన్నారు.