Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పేదల పెన్నిధి, నిలువెత్తు సంక్షేమ రూపం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వరంగల్ పార్లమెంట్ కో-కన్వీనర్ అప్పం కిషన్ అన్నారు. గురువారం దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతిని వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళలర్పించారు. అనంతరం అమతవర్శిని వద్ధ, అనాథ ఆశ్రములో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వద్ధులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం నియోజక వర్గ వ్యాపితంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుసుమ రామకష్ణ, ఎడ్ల రమేష్, మహేందర్, రాజు, కిరణ్, ప్రశాంత్, ఖాసీం, అశోక్, సతీష్, మౌనిక, స్వాతి, పావని, రమ్య, స్రవంతి, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
గోపనపల్లిలో ఎంపీటీసీ సూర రమేష్, పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి నాగార్జున ఆధ్వర్యంలో గురువారం మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొంకపాకలో ఉప సర్పంచ్ రంగు రంజిత్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లం రాజు, కుమారస్వామి, కారింగుల రాము, గద్దల సంపత్, గోపి, విజరు, మంద రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ - వర్ధన్నపేట
గురువారం మండల కేంద్రంలో వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ జిల్లా అధ్యక్షుడు నరకుడు వెంకటయ్య వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు కుమారస్వామి, ఒకటో వార్డు కౌన్సిలర్ సమ్మెట సుదీర్, రాంబాబు, వెంకట్ నర్సు, మంజూరు, శివరాత్రి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-శాయంపేట
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్ టీపీ మండలాధ్యక్షులు మారేపల్లి సుధాకర్ అన్నారు. గురువారం వైఎస్సార్ 12వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, మహేశ్, శంకర్, కుమార్ పాల్గొన్నారు.
జనహృదయ నేత వైఎస్ఆర్
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ తెలిపారు. గురువారం హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో వైఎస్ఆర్ 12వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంద్బంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రదాత, అన్నదాతల ఆత్మబంధువు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బిన్నీ లక్ష్మణ్, జాలి కమలాకర్‌రెడ్డి, జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మడిపల్లి కష్ణ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఐటి వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- కాజీపేట
ఖాజీపేట ఫాతిమానగర్‌లోని సహృదయ ఆశ్రమంలో గురువారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతినిని వైఎస్సార్ టీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ సభ్యుడు బీ శ్రావణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, ప్రశాంత్, టోనీ, ఆశ్రమ నిర్వాహకులు యాకూబి చోటు తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-నల్లబెల్లి
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం దివంగత మాజీ సీఎం వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, అశోక్, చరణ్ సింగ్, చర్ల శివారెడ్డి, శేఖర్, రాంమ్మూర్తి, మురళి, రవి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
గురువారం ఎర్రగట్టుగుట్ట వద్ద వైఎస్సార్ వర్థంతిని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చల్ల అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వెఎస్ పాలన స్వర్ణయుగమని, ఆ సంక్షేమ పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక రకంగా లబ్ది పొందిందని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్ళీ ఆ రాజన్న సంక్షేమ పాలన వైఎస్ షర్మిలతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సూర అక్షరు, వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నవతెలంగాణ-సంగెం.
మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మెట్టుపల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు ఆగపాటి రాజులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మెట్పల్లి ఏలియా, మాజీ సర్పంచ్ గుండేటి ఎల్లయ్య, పులి సాంబయ్య, పోలబోయిన శీను, కేదాసి సునీల్, గుండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు