Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుస కార్యక్రమాలతో జోష్
మానుకోట చేరికలతో
'గులాబీ'లు అప్రమత్తం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్త్తోంది. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జాతీయా మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఉండడంతో పార్టీ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్న విషయం విదితమే. ఈక్రమంలో జనగామ జిల్లాలోనూ పార్టీ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామక మైన అనంతరం రాష్ట్రస్థాయిలో పలు కార్యక్ర మాలకు రూపకల్పన చేసిన దరిమిలా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నేతలు ఆయా కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. స్థానికంగా కార్యక్రమాల ను రూపొందించుకొని రాష్ట్ర ప్రభుత్వ విధానా లను విమర్శిస్తూ ప్రత్యక్ష నిరసనలకు దిగడం ప్రారంభించారు. తాజాగా 'కుడా'లో జరుగు తున్న అవినీతిపై ఆందోళనకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చు కోవడం అధికార టీఆర్ఎస్లో కలకలం సృష్టిం చింది. సెప్టెంబర్ 17న హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం పెంచి పార్టీని బలోపేతం చేయడానికి టీపీసీసీ నాయకత్వం కృషి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేస్తున్న ఆందోళనలు రాజకీ యంగా చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలను పెంచుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్ని స్తుండ డం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం ములుగు, జనగామ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ కార్య క్రమాలు నిత్యం జరుగుతుండేవి. ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క వుండడం, జనగామ జిల్లాలో డిసిసిబి మాజీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమించాక ఆయన చేపట్టిన పలు రాష్ట్రస్థాయి కార్యక్రమాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు చురుగ్గా కదలడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, జనగామ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిత్యం ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. హన్మకొండ
జిల్లాలో అడపాదడపా పెద్ద ఎత్తున జరుగుతున్న దాఖలాలు లేవు. సొంతంగా ఆందోళనా కార్యక్రమాలను గతంలో నిర్వహించకపోయినా, తాజాగా ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలే లేవు. దీంతో పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది.
మానుకోటలో ప్రకంపనలు
మహబూబాబాద్ జిల్లాలో తాజాగా కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహాత్మక అడుగులతో అధికార టీఆర్ఎస్కు చెందిన కీలక నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేటీఆర్ సీరియస్ కావడంతో వారంతా ఐక్యతారాగం చాటారు. నాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మహబూబాబాద్ ప్రాంతం నేడు చతికిలపడింది. అధికార టీఆర్ఎస్కు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ ి మాలోత్ కవిత, ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ల మధ్య సఖ్యత లేదు. ఎవరి ఆధిపత్యం వారిదే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి టీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్ట్‌లో చేర్చుకుంది. దీంతో ఖంగుతిన్న అధికార టిఆర్ఎస్ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు తేరుకొని మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని వెంటనే నియమంచడానికి ఐక్యతా రాగాన్ని ప్రదర్శించడం గమనార్హం.
'గు'లాబీ' అసంతృప్త నేతలపై 'రేవంత్' టీం దృష్టి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో పావులు కదిపినట్టే మిగతా జిల్లాల్లోనూ పావులు కదుపుతున్నట్లు సమాచారం. మహబూబా బాద్ జిల్లాలో టీఆర్ఎస్ అసంతృప్తి నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లే త్వరలో భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చేర్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి బృందం స్పెషల్ ఫోకస్ పెట్టిందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది..
సెప్టెంబర్ 17న బహిరంగసభ
సెప్టెంబర్ 17న హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో రాష్ట్రస్థాయి బహిరంగసభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిం చనుంది. ఈ బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశముందని, ఎఐసిసి వర్గాలు ధృవీకరించాల్సి వుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.ఈ బహిరంగసభ ద్వారా హసన్పర్తికి పరిసర ప్రాంతాల్లోనే హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన మండలాలు ఉండడంతో హుజురాబాద్ నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా పుంజుకోవడం పార్టీ శ్రేణుల్లో జోష్‌ను పెంచింది. సెప్టెంబర్ 17న బహిరంగసభ విజయవంతమైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.